100 పడకల ఆసుపత్రి కోసం ప్రయత్నం చేస్తున్నాం - we are working on getting 100 hospital beds and 500 oxygen concentrators says jacqueline
close
Published : 18/05/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100 పడకల ఆసుపత్రి కోసం ప్రయత్నం చేస్తున్నాం

ఇంటర్నెట్‌ డెస్క్:  బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొవిడ్‌ సమయంలో తన వంతుగా నిరుపేదలకు ఆహారం అందజేస్తూ మానవతను చాటుకుంటోంది. ఇటీవల జాక్వెలిన్‌ ‘యేలో’ ఫౌండేషన్‌ ప్రారంభించి దీని ద్వారా ఆపన్నుల కోసం పాటుపడుతోంది. ప్రస్తుతం జాక్వెలిన్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ కొవిడ్ కేర్ సెంటర్‌లో సేవలు కొనసాగిస్తోంది. రాబోయో భవిష్యత్తులో పౌండేషన్‌ ద్వారా ఏం చేస్తుందో తెలియజేసింది. ‘‘మేం 100 పడకల ఆసుపత్రితో పాటు 500 పైగా ఆక్సిజన్‌ కాన్స్న్‌ట్రేటర్‌లను సమకూర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర రెండు అంబులెన్స్ లు ఉన్నాయి. ఇంకా ఏమేమీ చేయగలమో దానికోసం కృష్షి చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలో చాలామంది అంబులెన్స్ ఖర్చులు భరించ లేక ప్ర్రాణాలు కోల్పోతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. అందుకే మేం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించాం. ఇందులో అవసరమైన మందుల, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాం. అంతేకాదు మా అంబులెన్స్ కోసం ఫోన్‌ చేసేందుకు టోల్ ఫ్రీ నెంబరు నమోదు కోసం  దృష్టి సారిస్తున్నామని’’ తెలిపింది. ఈ విపత్కర కాలంలో రోటీ బ్యాంక్‌ ఫౌండేషన్‌తో కలిసి నిరుపేదలకు ఆహారం అందజేసింది. ఫౌండేషన్‌తో కలిసి లక్ష మందికి ఆహారం అందజేయడం ఇంకా మాస్కులు, పోలీసులకు శానిటైజర్లతో పాటు రెయిన్‌ కోట్లను విరాళంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. జాక్విలెన్‌ ఇటీవల విడుదలైన ‘రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్‌ భాయి’ చిత్రంలో ‘దిల్‌ దే దియా’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘భూత్ పోలీస్‌’, ‘అటాక్‌’, ‘సర్కస్‌’తో పాటు అక్షయ్‌ కుమార్‌తో కలిసి  ‘బచ్చన్‌ పాండే’, ‘రామ్‌ సేతు’ వంటి హిందీ చిత్రాల్లో నటిస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని