ఇప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాం: సచిన్‌ - we slowly move on from earlier COVID19
close
Published : 15/10/2020 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాం: సచిన్‌

(Photo: sachin twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 విషయంలో ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అన్నాడు. గ్లోబల్‌ హ్యాండ్‌వాష్‌ డే సందర్భంగా సచిన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేశాడు. ‘ప్రారంభంలో ఉన్న కోవిడ్‌19 నిబంధనల నుంచి మనం ఇప్పుడిప్పుడే విముక్తి పొందుతున్నాం. మళ్లీ సాధారణస్థితికి చేరుకుంటున్నాం. అయినప్పటికీ మనం ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. చేతులు కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, ఆరు అడుగుల దూరం పాటించడం వంటివి మనం మర్చిపోవద్దు. మనం పాటిస్తూ.. ఇతరులకూ ఆదర్శంగా నిలుద్దాం’ అని సచిన్‌ అన్నాడు.
కరోనా ప్రభావంతో 2020 ఏడాది అతలాకుతలమవుతోంది. ప్రస్తుతం భారత్‌లో 73,07,097 కేసులు నమోదయ్యాయి. కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో జాగ్రత్తలు పాటించడమే సరైన మార్గమని వైద్యులు సైతం చెబుతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని