Mask: ఇలా పెడితే మేలు! - wearing one surgical and cloth mask prevent spread of corona
close
Updated : 01/06/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mask: ఇలా పెడితే మేలు!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా బారిన పడకుండా మాస్కులు రక్షణగా నిలుస్తున్నాయి. మాస్క్‌ ధరించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో మంది కరోనా బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఎక్కువగా క్లాత్‌, సర్జికల్‌, ఎన్‌-95 మాస్కులు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కర్చీఫ్‌లు, క్లాత్‌ మాస్కులు ఉపయోగిస్తున్నారు. అయితే మాస్క్‌ల వినియోగంపై ప్రజల్లో ఇంకా అయోమయం తొలగిపోలేదు. ఎలాంటి మాస్కులు వాడితే మేలు? కరోనా ముప్పును ఏ రకం మాస్కులు నిరోధించగలవు? అనే సందేహాలు ప్రజలను వెంటాడుతున్నాయి. వీటికి తోడు అపరిశుభ్రమైన మాస్క్‌లతో బ్లాక్ ఫంగస్ సోకే ముప్పుందని ఎయిమ్స్  వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్‌ల వినియోగంపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

డబుల్‌ మాస్క్‌

సమూహంలోకి వెళ్లినపుడు డబుల్‌ మాస్క్‌ ధరించడం మేలు. సర్జికల్‌మాస్క్‌తో పాటు క్లాత్‌ మాస్క్‌ ధరించాలి. మాస్క్‌ ధరించే ముందు, తర్వాత చేతుల శానిటైజ్‌ చేసుకోవాలి. క్లాత్‌మాస్క్‌లను ఒకరిది మరొకరు వాడకూడదు. సర్జికల్‌ మాస్కులను రోజులో ఒక్క సారి మాత్రమే వాడాలి. సర్జికల్‌ మాస్క్‌, క్లాత్‌మాస్క్‌ కలిపి పెట్టుకుంటే 85 శాతం రక్షణ లభిస్తుందిని అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ పరిశోధనలో తేలింది. 

ఎన్‌-95 మాస్క్‌

ఎన్‌-95 మాస్కు వైరస్‌ నుంచి 95 శాతం రక్షణ కల్పిస్తుంది. ఈ మాస్క్‌ను వేడినీళ్ల, సబ్బునీళ్లతోగాని ఉతకకూడదు. అలా చేయడం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల అయిదు ఎన్‌-95 మాస్కులను దగ్గర ఉంచుకొని రోజుకొకటి చొప్పున పెట్టుకోవాలి. మొదటి రోజు పెట్టుకున్న మాస్క్‌ నాలుగు రోజుల తర్వాత పెట్టుకోవాలి. అలా ఒక్కో మాస్క్‌ అయిదు సార్లు వాడుకోవచ్చు. రోజులో కొంత సేపే మాస్క్‌ను వాడుతున్నాం కదా అని వారం అంతా ఒకే మాస్క్‌ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. తడిచిన, చెమట పట్టిన, తేమ చేరిన మాస్కును అస్సలు పెట్టుకోకూడదు. అలాగే ఒక రోజువాడిన మస్క్‌ను వారం, పది పాటు అలా వదిలేస్తే దాని మీద ఉండే తేమ వల్ల ఫంగస్‌ ఏర్పడుతుంది. ఆ మాస్క్‌ పెట్టుకోవడం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడే అవకాశం ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని