వాటితో పోల్చకండి: నాగార్జున - what is hollywood we are at tollywood dont compare says nagarjuna
close
Published : 03/04/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటితో పోల్చకండి: నాగార్జున

నా లైఫే ఒక రిస్క్ అంటోన్న హీరో

హైదరాబాద్‌: ‘వాట్‌ ఈజ్‌ హాలీవుడ్‌. వి ఆర్‌ హియర్‌ ఎట్‌ టాలీవుడ్‌. డోంట్‌ కంపెర్‌’ అని అంటున్నారు అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వైల్డ్‌డాగ్‌’. హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడులను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘వైల్డ్‌డాగ్‌ మిషన్‌ అకంప్లీష్డ్‌’ కార్యక్రమాన్ని తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసింది. తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన మీడియా మిత్రులు, సినీ ప్రియులకు థ్యాంక్స్‌ తెలియజేసింది.

‘నేను చేసే ప్రతి చిత్రాన్ని ఆదరిస్తూ.. నా వెంటే ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ‘వైల్డ్‌డాగ్‌’పై ప్రశంసల వర్షం కురిపించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్యూ. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న కారణంగా ‘వైల్డ్‌డాగ్‌’ రిలీజ్‌ చేయాలా? వద్దా?అని మేమంతా ఆలోచించాం. మంచి కథ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూస్తారని నమ్మాం. విడుదల చేశాం. అదే మాదిరిగా కలెక్షన్లు‌ కూడా బాగానే వస్తున్నాయి. మాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా నా అభిమానులందరికీ థ్యాంక్స్‌ చెప్పాలి. నేను ఎలాంటి పాత్రల్లో నటించినా సరే ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎప్పటికీ నేను వాళ్లకి రుణపడి ఉంటాను’’ అని నాగార్జున అన్నారు.

మీకు వచ్చిన ఉత్తమమైన ప్రశంస?

నాగార్జున: ‘ప్రతి భారతీయుడు తప్పకుండా ఈ సినిమా చూడాలి’ అని చాలామంది అంటున్నారు. అదే నాకు ఉత్తమమైన ప్రశంస.

అరవైయేళ్ల వయసులో కూడా నాగ్‌కు ఇంత రిస్క్‌ అవసరమా అని అందరూ అంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం?

నాగార్జున:  నా లైఫే రిస్క్‌. రిస్క్‌లు తీసుకుంటూనే ఉంటాను.

‘వైల్డ్‌డాగ్‌’ సీక్వెల్‌ ఉందా?

నాగ్‌: సీక్వెల్‌ అనేది ఏమీ లేదు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం.

విజయ్‌వర్మ పాత్ర చేయడానికి ముఖ్య కారణం?

నాగ్‌: నాకు భయం లేదు. కొత్తదనం అంటే చాలా ఇష్టం. ఏదైనా సాధించాలనే ఆకలి ఉంది. విజయవర్మ పాత్ర నాకెంతో నచ్చింది. అందుకే ఈ సినిమాలో నటించాను.

యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఎన్ని రోజులు శ్రమించారు?

నాగ్‌: ప్రేమతో చేసే పనికి శ్రమ ఎప్పటికీ గుర్తుండదు.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్‌ని తలపించాయి. అలాంటి సన్నివేశాలు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేమిటి?

నాగ్‌: వాట్‌ ఈజ్‌ హాలీవుడ్. మనం టాలీవుడ్‌లో ఉన్నాం. వేరే దానితో పోల్చకండి.(నవ్వులు)

కొత్త తరహా కథలతో ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నారా? లేదా సెట్‌ చేస్తున్నారా?

నాగ్‌: మనసు ఎటు తీసుకువెళ్తే అలా వెళ్తున్నాను. దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌‌, నిర్మాత నిరంజన్‌ నాకు ఈ కథ చెప్పారు. ఈ కథ నాకు నప్పుతుందని భావించాను. అలాగే ఈ కథ అందరికీ చెప్పాలనిపించింది. వెంటనే ఓకే చేసేశాను.

అక్కినేని నాగేశ్వరరావుపై బయోపిక్‌ ఎప్పుడు?

నాగ్‌: మనసులో ఉంది. తప్పకుండా చేస్తాను. ఏమైనా తప్పులు చేస్తామేమోననే ఒక భయం ఉంది.  ‘మనం’ కూడా అలాంటి భయంలోనే చేశాను.

‘గురువారం ఇంట్లో వాళ్లందరూ ‘వైల్డ్‌డాగ్‌’ ప్రివ్యూ చూడడానికి వెళ్లిపోయారు. నేను మాత్రమే ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో చిరు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని పిలిచారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సరికి చేపల కూర వండి పెట్టారు. ఆయనతో కలిసి భోజనం చేసి పాత సినిమాల గురించి మాట్లాడుకుని సరదాగా నవ్వుకున్నాం. ఆయన చేసిన వంట చాలా బాగుంది’




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని