corona: వాట్సాప్‌ తోడుగా వృద్ధులకు సాయం - whatsapp chatbot to help senior citizens get covid19 vaccine launched by robin hood army
close
Published : 19/05/2021 23:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

corona: వాట్సాప్‌ తోడుగా వృద్ధులకు సాయం

ప్రారంభించిన రాబిన్‌ హుడ్‌ ఆర్మీ

దిల్లీ: కరోనా కాలంలో వృద్ధులకు ఆసరాగా ఉండేందుకు రాబిన్‌హుడ్‌ ఆర్మీ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వాట్సాప్‌ సహకారంతో దేశవ్యాప్తంగా తమ కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు బుధవారం వాట్సాప్‌ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. ఈ చాట్‌ ఆధారంగా వృద్ధులకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామని వారు తెలిపారు. ఒంటరిగా ఉండే వృద్ధులకు కావాల్సిన ఆహారం అందిచడం, వారు వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సహకరించడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా చేస్తామని వారు వెల్లడించారు.

ఎలా పనిచేస్తుంది?

ఒంటరిగా ఉన్న వృద్ధులు తమ వాట్సాప్‌లో +91-8971966164 నంబరుకు హాయ్‌ అని మెసేజును పంపాలి. అనంతరం వాలంటీర్‌ సాయం కావాలని కోరుతూ మూడు సంఖ్యను నొక్కాలి.  అప్పడు సంబంధిత వ్యక్తులకు సంస్థ వాలంటీర్లు సహకారం అందిస్తారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 186 నగరాల్లో రాబిన్‌ హుడ్‌ ఆర్మీ వాలంటీర్లు ఉన్నారు. ఇందులో సభ్యులుగా లేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. వారు కూడా ఇదే ఫోన్‌ నంబరుకు మెసేజ్‌ పెట్టాలి. అంతేకాకుండా అవసరంలో ఉన్న వారికి ఆహారం అందించే వెసులుబాటును కూడా వీరు కల్పిస్తున్నారు.

చిన్న వాట్సాప్‌ మెసేజ్‌ సాయంతో వృద్ధులకు సహకారం అందించేందుకు ప్రయత్నించడం చాలా సంతోషంగా ఉందని రాబిన్‌ హుడ్‌ ఆర్మీ వ్యవస్థాపకుడు నీల్‌ఘోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ మాట్లాడుతూ.. రాబిన్‌హుడ్‌ ఆర్మీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కొవిడ్‌ సహాయక చర్యలకు తమ నెట్‌ వర్క్‌ను అన్ని నగరాలకు విస్తరించడంలో వాట్సాప్‌ తమ వంతు ప్రయత్నం చేస్తుందన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని