WhatsApp: వాట్సాప్‌ గ్రూప్ ఐకాన్‌లుగా ఎమోజీలు, స్టిక్కర్లు - whatsapp users can set stickers and emojis as group icons soon
close
Published : 20/09/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WhatsApp: వాట్సాప్‌ గ్రూప్ ఐకాన్‌లుగా ఎమోజీలు, స్టిక్కర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొద్ది రోజులుగా వరుస ఫీచర్లతో అదరగొడుతున్న వాట్సాప్.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి పరిచయం చేయనుంది. వాట్సాప్‌ గ్రూప్‌ ఐకాన్‌ ఎడిటర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ సాయంతో యూజర్స్ సులువుగా తమ గ్రూప్‌ ఐకాన్‌లను మార్చుకోవచ్చు. అలానే ఎమోజీలు, స్టిక్కర్లను గ్రూప్‌ ఐకాన్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ముందుగా ఈ ఫీచర్ బీటా వెర్షన్‌ను ఐఓఎస్‌ యూజర్స్‌కి పరిచయం చేయనున్నట్లు వాబీటా వెల్లడించింది. 

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక యూజర్స్‌ తమ గ్రూప్‌ ఐకాన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ను ఎమోజీ, స్టిక్కర్‌తో అప్‌డేట్ చేసుకోవచ్చు. యూజర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసినప్పుడు యూజర్‌కి ఎమోజీ, స్టిక్కర్‌ పేరుతో రెండు ట్యాబ్‌లు కనిపిస్తాయి. వాటిలో యూజర్‌ తమకు నచ్చిన ట్యాబ్‌పై క్లిక్‌ చేసి గ్రూప్‌ ఐకాన్‌ను మార్చుకోవచ్చు. ఇప్పటికే వ్యూ వన్స్‌, మల్టీ డివైజ్‌ బీటా, డిస్‌అపియరింగ్ మెసేజెస్‌, ఫొటో ఎడిటింగ్, వాట్సాప్‌ పేమెంట్ వంటి పీచర్స్‌ని యూజర్స్‌కి పరిచయం చేసింది. త్వరలోనే వాట్సాప్‌ మరిన్ని యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ని తీసుకురానుంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని