కేవలం నీరసమే అనుకున్నా కానీ..: రకుల్‌ - when i got my first symptom which was just feeling a lot of fatigue i dismissed it says rakul
close
Published : 01/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేవలం నీరసమే అనుకున్నా కానీ..: రకుల్‌

కొవిడ్‌ను మొదటే గుర్తించలేకపోయా..!

హైదరాబాద్‌: కరోనా బారినపడి ఇటీవల కోలుకున్నారు నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కొన్నిరోజుల క్రితం కొవిడ్‌-19 నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో తాజాగా ఆమె తన కుటుంబసభ్యుల్ని కలిసేందుకు ముంబయి చేరుకున్నారు. అయితే, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో రకుల్‌ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, దాని నుంచి ఎలా కోలుకున్నారు? అనే విషయాలను తాజాగా ఆమె ఓ పత్రికతో పంచుకున్నారు.

‘షూటింగ్స్‌లో భాగంగా గత కొన్ని నెలల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. చిత్రీకరణల్లో పాల్గొంటున్న సమయంలో ఓ రోజు బాగా అలసటగా అనిపించింది. వరుస షూటింగ్స్‌ వల్లే నీరసంగా ఉండొచ్చని అనుకున్నాను. అదీ కాక.. ప్రతి మూడు రోజులకోసారి చిత్రబృందం మొత్తం కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకుంటున్నాం. కాబట్టి, కరోనా వచ్చినట్లు అస్సలు భావించలేకపోయాను. కాకపోతే ఓ రోజు ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే మా టీమ్‌లోని సభ్యులకు సమాచారాన్ని అందించి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. ‘అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యంగానే ఉన్నాను’ అని క్వారంటైన్‌లో ఉన్నప్పుడు నిత్యం నాకు నేను చెప్పుకునేదాన్ని. దానివల్ల నాలో నేను ధైర్యాన్ని నింపుకోగలిగాను. మెడిసిన్స్‌ ఎక్కువ మోతాదులో తీసుకోలేదు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తిన్నాను. నా రోజువారీ లైఫ్‌ స్టైల్‌ కారణంగానే కొవిడ్‌-19 నుంచి త్వరితగతిన కోలుకున్నానని భావిస్తున్నాను’ అని రకుల్‌ వివరించారు.

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో భాగంగా రకుల్‌ కొంతకాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ డీగ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇందులో రకుల్‌ ‘ఓబులమ్మ’ అనే గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిగా కనిపించనున్నారు. మరోవైపు ఆమె తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ వచ్చే ఏడాది మొత్తం బిజీగా ఉండనున్నారు.

ఇవీ చదవండి

బొమ్మ థియేటర్లోనే పడాలని..!

అలా.. మొదలై.. ఇలా.. కుదేలై.. మళ్లీ.. విడుదలై..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని