Rahul Dravid: సురేశ్ రైనాను తిట్టిన ద్రవిడ్‌ - when suresh raina scolded by rahul dravid
close
Updated : 14/06/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rahul Dravid: సురేశ్ రైనాను తిట్టిన ద్రవిడ్‌

అసభ్య పదం రాసిన టీషర్ట్‌ ధరించడమే కారణం

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ తనను తిట్టారని మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. తాను ధరించిన టీషర్టే అందుకు కారణమని పేర్కొన్నాడు. భారత క్రికెటర్‌గా మనం హుందాతనంతో కూడిన దుస్తులే వేసుకోవాలని మందలించినట్టు తెలిపాడు. దాంతో ‘FCUK’ అని రాసున్న టీషర్ట్‌ను చెత్తకుండీలో పారేసి మరొకటి ధరించానని తన ఆత్మకథ ‘బిలీవ్‌’లో రాసుకున్నాడు.

రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలోనే సురేశ్ రైనా అరంగేట్రం చేయడం గమనార్హం. 2006లో ముక్కోణపు సిరీసు కోసం టీమ్ఇండియా మలేసియాలో పర్యటించింది. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో తలపడింది. ఓ రోజు రైనా పై అక్షరాలు రాసున్న బ్రాండెడ్‌ టీషర్ట్‌ ధరించాడు. దాంతో అతడిపై ద్రవిడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానిని విడిచి మరొకటి వేసుకోవాలని సూచించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మందలించాడు.

‘నువ్వు ఎలాంటి దుస్తులు ధరించి, ఎక్కడ తిరుగుతున్నావో తెలుసా? నువ్వొక భారత క్రికెటర్‌వి. అలాంటి పదాలు రాసున్న టీషర్టులు ధరించి నువ్వు బయట తిరగకూడదు’ అని ద్రవిడ్‌ తనను మందలించాడని రైనా రాశాడు. ‘ఆ సమయంలో నేనెంతో భయపడ్డాను. వెంటనే డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లిపోయాను. దుస్తులు మార్చుకొని టీషర్టును చెత్తకుండీలో పారేశాను’ అని అతడు గుర్తు చేసుకున్నాడు.

భారత ఆటగాళ్లు బయట హుందాగా ఉండాలన్నదే ద్రవిడ్‌ ఉద్దేశమని రైనా తెలిపాడు. దేశానికి ఆడటం మిస్టర్‌ డిపెండబుల్‌ ఎంతో గౌరవంగా భావిస్తారని పేర్కొన్నాడు. క్రికెటర్లు భారతదేశానికి ప్రతినిధులని, ఎంపిక చేసుకొనే దుస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నది ఆయన కోరికగా చెప్పాడు. ఇక నెట్స్‌లో సాధన చేసేటప్పుడు ద్రవిడ్‌ సీరియస్‌గా ఉంటారని అన్నాడు.

‘కొన్నిసార్లు నాకు ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త నవ్వితే బాగుంటుందని చెప్పాలని భావించేవాడిని. కానీ ఆయన ఆటకు సిద్ధమయ్యే తీరు అలాగే ఉంటుందని అందరికీ తెలుసు. సాధన చేసేటప్పుడు ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఉండేవారు’ అని రైనా తెలిపాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని