Virat Kohli: ధోనీని అచ్చంగా దించేసిన వేళ.. - when virat kohli imitates ms dhoni
close
Published : 18/05/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: ధోనీని అచ్చంగా దించేసిన వేళ..

బంగ్లాదేశ్‌పై వికెట్‌ కీపింగ్‌ చేసిన ఛేదన రారాజు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైదానంలో భావోద్వేగాలు పలికించడంలో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ దిట్ట! అతడికి ఏమనిపిస్తే అదే చేసేస్తాడు. ఎవరినైనా సరే అనుకరించేస్తాడు. విచిత్రమైన హావభావాలు ప్రదర్శిస్తాడు. 2015లో అతడు ఏకంగా ఎంఎస్‌ ధోనీనే అనుకరించి ఆశ్చర్యపరిచాడు.

మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించినా ఎంఎస్‌ ధోనీ గంభీరంగానే ఉంటాడు. జట్టు సారథిగా తిరుగులేని ముద్ర వేయడమే ఇందుకు కారణం. అందుకే కొన్నిసార్లు అతడితో మాట్లాడేందుకూ ఆటగాళ్లు జంకుతారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా అతడు చెప్పిందే ఫైనల్‌. అలాంటి వ్యక్తిని అనుకరించే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ కోహ్లీ చేసేశాడు.

2015లో బంగ్లాదేశ్‌తో ఆడిన ఓ వన్డేలో కోహ్లీ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. 43వ ఓవర్లో మహీకి కడుపులో ఇబ్బందిగా ఉండటంతో డ్రస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు. దాంతో వికెట్‌ కీపింగ్‌ చేసేందుకు విరాట్‌ ముందుకొచ్చాడు. ఉమేశ్ యాదవ్‌ బౌలింగ్‌లో వికెట్లను కాచుకున్నాడు. ఎప్పుడో గానీ దొరకని అవకాశంగా భావించాడో ఏమో మహీని అనుకరించాడు. అతడిలాగే గ్లోవ్స్‌ను సర్దుకున్నాడు. ఫీల్డర్లను ముందుకు వెనక్కి జరిపాడు. భుజాలను ఎగరేశాడు.

ఈ సంఘటన జరిగి చాలారోజులే అయినా తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అందులో కోహ్లీ పలికించిన హావభావాలు చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు. మీరూ చూసేస్తారా మరి?




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని