Cricket news: అక్తర్‌ కవ్వింపు.. ఘాటుగా వీరూ జవాబు - when virender sehwag sledged shoaib akhtar brutally
close
Published : 10/07/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket news: అక్తర్‌ కవ్వింపు.. ఘాటుగా వీరూ జవాబు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ జోరుమీదుంటే బౌలర్లకు ఊచకోతే! విధ్వంసకరంగా విరుచుకుపడేవాడు. బంతి దొరికితే బౌండరీకి పంపించడమే పనిగా పెట్టుకొనేవాడు. మ్యాచ్‌ ఎంత ఉత్కంఠగా సాగుతున్నా సరే మైదానంలో మాత్రం సరదాగా ఉండేవాడు. ప్రత్యర్థి బౌలర్లు కవ్విస్తుంటే అంతే సమయస్ఫూర్తితో బదులిచ్చేవాడు. ముల్తాన్‌ టెస్టులో త్రిశతకం చేసినప్పుడు షోయబ్‌ అక్తర్‌ కవ్విస్తే వీరూ ఎలా స్పందించాడో సంజయ్‌ మంజ్రేకర్‌ గుర్తు చేసుకున్నాడు.

ఆ మ్యాచులో సెహ్వాగ్‌ 375 బంతుల్లో 309 పరుగులు చేశాడు. దాంతో ముల్తాన్‌ టెస్టును టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో గెలిచింది. సెహ్వాగ్‌ పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ద్విశతకం బాదిన తర్వాత వీరూకు అక్తర్‌ వరుసగా బౌన్సర్లు విసిరడం మొదలు పెట్టాడు. వాటన్నిటినీ సెహ్వాగ్‌ వదిలేశాడు. అసహనంతో అక్తర్‌ అతడి వద్దకు వచ్చి ఓ విషయం అడిగాడట.

‘అక్తర్‌ వరుసగా బౌన్సర్లు సంధిస్తున్నాడు. సెహ్వాగ్‌ వాటిని వదిలేస్తున్నాడు. అప్పుడు వీరూను రెచ్చగొట్టేందుకు అక్తర్‌ అతడి దగ్గరికి వచ్చాడు. నువ్వు 200 పరుగులు చేశావు. నేను ఎన్నో బౌన్సర్లు విసిరాను. కనీసం ఒక్క పుల్‌షాటైనా ఆడొచ్చు కదా అని అడిగాడు. దానికి సెహ్వాగ్‌ చమత్కారంగా జవాబిచ్చాడు. నువ్వు బౌలింగ్‌ చేస్తున్నావా లేదా భిక్ష అడుక్కుంటున్నావా అని బదులిచ్చాడు’ అని మంజ్రేకర్‌ ఆనాటి సంగతిని వివరించాడు. అవసరమైతే మైదానంలో వీరూ పాటలు పాడే సంగతి తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని