జాన్సన్‌ టీకాకు అత్యవసర అనుమతులు - who adds janssen vaccine to list of safe and effective emergency tools against covid 19
close
Published : 13/03/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాన్సన్‌ టీకాకు అత్యవసర అనుమతులు

జెనీవా: జాన్సన్‌ అండ్‌ జాన్సన్ సంస్థ రూపొందించిన కరోనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. అంతర్జాతీయ కొవాక్స్‌ కూటమిలో ఈ సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల ప్రకారం జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సంస్థ టీకా వయోజనులపై ప్రభావవంతంగా పనిచేస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ తెలిపారు. ఐరోపా సమాఖ్యకు చెందిన యురోపియన్‌ మెడిసన్స్‌ ఏజెన్సీ ఈ టీకాకు అనుమతి ఇచ్చిన ఒక్కరోజులోనే డబ్ల్యూహెచ్‌ఓ కూడా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని