వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య 6 వారాలు - who amid short supplies vaccine doses can be 6 weeks apar
close
Published : 08/01/2021 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య 6 వారాలు

సిఫార్సు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: ఫైజర్‌ టీకా రెండు డోసులకు మధ్య ఆరు వారాల వరకూ గడువును పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం సిఫార్సు చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో సలహా సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వివిధ దేశాల్లోని కొవిడ్‌ పరిస్థితుల వల్ల వ్యాక్సిన్‌ రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఈ మేరకు సిఫార్సులు విడుదల చేశారు. ముందుగా రెండు టీకా డోసులకు మధ్య 21 నుంచి 28 రోజుల విరామం ఉండాలని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వ్యాక్సిన్‌ ఎపిడెమియోలాజికల్‌ పరిస్థితుల్లో  ఈ విధానం అనుసరణీయమని వెల్లడించారు. ప్రస్తుతమున్న ప్రయోగ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను సమీక్షించిన తర్వాతే వ్యాక్సిన్‌ డోసుల మధ్య విరామాన్ని 42 రోజులకు పెంచుతున్నామన్నారు.

డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ మాట్లాడుతూ.. ‘‘ఉదాహరణకు బ్రిటన్‌ను తీసుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రెండో డోసును 12వారాల తర్వాత ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇటువంటి పరిస్థితులను బట్టే మేము సిఫార్సులలో మార్పులు చేశాం.’’ అని అన్నారు. కరోనా వచ్చిన ఆరు నెలల్లోపు మళ్లీ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని.. ఇలాంటి సందర్భాల్లో వారికి వ్యాక్సిన్‌ ఆలస్యంగా ఇచ్చినా ఎటువంటి సమస్య ఉండదని ప్రపంచారోగ్య సంస్థ తెలిపింది. ఒకసారి వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రజలు రెండో డోస్‌ కూడా కచ్చితంగా తీసుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. బూస్టర్‌ డోస్‌ గురించి కానీ, వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వైరస్‌ సంక్రమించే అవకాశాలు లేవన్నదానికి గానీ కచ్చితమైన ఆధారాలు లేవని వారు తెలిపారు.

ఇవీ చదవండి..

రద్దుకే రైతన్నలు.. కష్టమన్న కేంద్రం

అమెరికా చరిత్రలో చీకటి రోజులు

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని