‘ఆర్‌సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా? - who is director of ramcharan and shankar combo
close
Published : 26/02/2021 00:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర దర్శకులు సినిమా ప్రకటించడమే ఆలస్యం దానికి సంబంధించి రోజుకో వార్త వినిపిస్తుంది సినీ వర్గాల్లో. శంకర్‌- రామ్‌ చరణ్‌ కలయికలో తెరకెక్కనున్న చిత్రం విషయంలో ఇదే జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాలో నటించే కథానాయికల గురించి చర్చ సాగింది. రష్మిక, ఓ కొరియా నటికి చరణ్‌ సరసన నటించే అవకాశం దక్కిందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజాగా సంగీత దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఈ ఆసక్తికర ప్రాజెక్టుకు అనిరుధ్‌ స్వరాలు అందించబోతున్నాడని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే రజనీకాంత్‌, విజయ్‌ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు సంగీతం అందించి మెప్పించాడు అనిరుధ్‌. నేపథ్య సంగీతంలోనూ అనిరుధ్‌కి మంచి పేరుంది. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసి అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శంకర్‌.. అనిరుధ్‌కి అవకాశం ఇచ్చారని కోలీవుడ్‌ మీడియా చెప్పుకొస్తుంది. మరి ఇందులో నిజమెంత? అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఈ చిత్రాన్ని ‘ఆర్‌సీ 15’ వర్కింగ్‌ టైటిల్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉన్నారు చరణ్‌. అది పూర్తయిన వెంటనే శంకర్‌ దర్శకత్వంలో నటించనున్నారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని