Nikhil: ఆస్పత్రి బిల్లులపై నిఖిల్‌ ఆగ్రహం - who is regulating them says nikhil regarding hospital bills
close
Published : 07/06/2021 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nikhil: ఆస్పత్రి బిల్లులపై నిఖిల్‌ ఆగ్రహం

వీటిని ఎవరు నియంత్రిస్తారు?

హైదరాబాద్‌: వైద్యం పేరుతో కొన్ని ఆస్పత్రులు సామాన్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని నటుడు నిఖిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీ ఏదైనా సరే.. లక్షల్లోనే బిల్లులు కట్టించుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆస్పత్రి బిల్లులను ఉద్దేశిస్తూ తాజాగా నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘నేను ఎంతోమంది ఆస్పత్రి బిల్లులు పరిశీలించాను. అందులో చాలామంది బిల్లులు రూ.10 లక్షలకు మించి ఉన్నాయి. అలాగే, ఆస్పత్రి బిల్లులను చెల్లించడంలో కొంతమందికి మేము చేతనైనంత సాయం చేశాం. అయితే, బిల్లులు వసూలు చేయడంలో ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆస్పత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టుకుంటున్నాయి? వీటిని నియంత్రించేది ఎవరు?’ అని నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన నిఖిల్‌.. తన టీమ్‌తో కలిసి కరోనా బాధితులకు సాయం అందించారు. పలు సోషల్‌మీడియా ఖాతాల వేదికగా.. ఆస్పత్రి పడకలు, మందులు, ఏ ఇతర సామగ్రి కావాలని కోరినా.. వెంటనే తన ఆపన్నహస్తాన్ని అందించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని