close
Published : 23/02/2021 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఇద్దరిలో ‘దళపతి‌ 66’ దర్శకుడెవరు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దళపతి విజయ్‌ 66వ చిత్రం గురించి కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. విజయ్‌ తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేది ఇతడే అంటూ ఇద్దరు దర్శకుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లలో ఒకరు అట్లీ కాగా..  మరొకరు లోకేశ్‌ కనకరాజ్‌. సామాజిక మాధ్యమాల్లోనూ వీరిద్దరి పేర్లే ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్‌ చర్చల దశలో ఉన్నారని, తన 66 సినిమాకు ఎవర్ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారో త్వరలోనే తెలియనుందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు దర్శకులు గతంలో విజయ్‌తో పనిచేసిన వారే. ఇటీవలే విడుదలైన ‘మాస్టర్‌’ చిత్రానికి లోకేశ్‌ కనకరాజే దర్శకుడు. విజయ్‌- అట్లీ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. మరోసారి విజయ్‌ ఈ దర్శకుడికే అవకాశం ఇస్తారంటూ ట్వీట్‌ చేస్తున్నారు విజయ్‌ అభిమానులు. మరి విజయ్‌ తన సినిమాకు సారథిగా ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని