కొవిడ్‌ వేరియంట్ల పేర్లు ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో - who labels india other global covid variants with greek names
close
Published : 05/06/2021 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వేరియంట్ల పేర్లు ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో వెలుగు చూసిన బి.1.617.1, బి.1.617.2 కరోనా వేరియంట్లకు గ్రీకు ఆక్షరాలను ఉపయోగించి కప్పా, డెల్టా అనే పేర్లను ఖరారు చేయగా.. తాజాగా ప్రపంచంలో గుర్తించిన అన్ని కరోనా వేరియంట్లకు పేర్లను ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆల్ఫా వేరియంట్‌: బి.1.1.7 వేరియంట్‌ను సెప్టెంబరు 2020లో యూకేలో గుర్తించారు.
బీటా వేరియంట్‌: బి.1.351 వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో మే 2020లో గుర్తించారు.
గామా వేరియంట్‌: పి.1 వేరియంట్‌ను నవంబర్‌ 2020లో బ్రెజిల్‌లో గుర్తించారు. 
ఎప్సిలాన్‌ వేరియంట్: బి.1.427/బి.1.429 వేరియంట్లను మార్చి 2020 అమెరికాలో గుర్తించారు.
జెటా వేరియంట్‌: పి.2 వేరియంట్‌ను ఏప్రిల్‌ 2020 బ్రెజిల్‌లో గుర్తించారు.
ఈటీఏ వేరియంట్: బి.1.525. ఈ వేరియంట్ డిసెంబర్ 2020లో వివిధ దేశాల్లో గుర్తించారు.
థెటా వేరియంట్‌: పి.3 వేరియంట్‌ను ఫిలిప్పీన్స్‌లో జనవరి 2021లో గుర్తించారు.
ఐఓటీఏ వేరియంట్‌: బి.1.526 ఈ వేరియంట్‌ను నవంబర్‌ 2020 అమెరికాలో గుర్తించారు.

ఈ పేర్లు ఇప్పటికే ఉన్న శాస్త్రీయ నామాలను భర్తీ చేయవని, బహిరంగ చర్చల్లో సులభంగా పలకడానికి మాత్రమే ఉద్దేశించినవని డబ్ల్యుహెచ్‌వో టెక్నికల్ కొవిడ్-19 లీడ్ అయిన డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో మొదటిలో ‘బి.1.617’ వేరియంట్‌ను ‘ఇండియన్‌ వేరియంట్‌’గా పిలవడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేయడంతో డబ్ల్యూహెచ్‌వో దాని పేరును డెల్టా వేరియంట్‌గా మార్చింది. వైరస్‌ రకాన్ని అది మొదట వెలుగు చూసిన దేశం పేరుతో పిలవరాదని డబ్ల్యూహెచ్‌వో వైరస్‌ రకాలను సులువుగా ప్రస్తావించడానికి వీలుగా గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లను పెట్టాలని నిర్ణయించింది. ఈ విధానం వల్ల తమ భూభాగంలో కనిపించిన కొత్త రకాల గురించి వెల్లడించడానికి అనేక దేశాలు నిస్సంకోచంగా ముందుకొస్తాయని డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని