Coronavirus: కరోనా పుట్టుకపై మరోసారి దర్యాప్తునకు సిద్ధం..! - who to relaunch covid origins probe with fresh team
close
Updated : 28/09/2021 04:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavirus: కరోనా పుట్టుకపై మరోసారి దర్యాప్తునకు సిద్ధం..!

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మరోసారి పరిశోధనలు ప్రారంభించే అవకాశం ఉంది! ఈ వారం చివరిలోగా ఏర్పాటయ్యే కొత్త బృందం ఆధ్వర్యంలో అన్వేషణ చేపట్టనుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన తాజా కథనంలో పేర్కొంది. జెనెటిక్స్‌, జంతు వ్యాధులు, లేబొరేటరీ సేఫ్టీ, బయోసెక్యూరిటీ తదితర రంగాల్లో నిపుణులైన దాదాపు 20 మంది శాస్త్రవేత్తలు ఈ బృందంలో ఉంటారని, ఈ క్రమంలో చైనాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆధారాలు సేకరిస్తారని తెలిపింది.

గతంలోనూ ఓ సారి..

గతంలోనూ డబ్ల్యూహెచ్‌వో- చైనా సంయుక్త ఆధ్వర్యంలో ఈ అంశంపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మార్చిలో నివేదిక విడుదల చేశారు. వుహాన్‌లోని ప్రయోగశాల నుంచే వైరస్‌ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చిందన్న వాదనలను ఇందులో తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో వుహాన్‌లోని ప్రయోగశాలలు, మార్కెట్లలో రెండో ఫేజ్‌ అధ్యయనాలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానోమ్‌ జులైలో ప్రతిపాదించగా.. చైనా దీన్ని తిరస్కరించింది. అమెరికాలోని యూఎస్ ఆర్మీ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్(యూఎస్‌ఎమ్‌ఆర్‌ఐడీ)తో సహా ఇతర దేశాల్లోనూ విచారణ చేపట్టాలని చైనా శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌వోను అప్పట్లో డిమాండ్‌ చేశారు.

చైనా అనుమతిస్తుందా!

మరోవైపు డబ్ల్యూహెచ్‌వో కొత్త బృందాన్ని దేశంలోకి అనుమతిస్తుందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. ‘ఈ తరహా పరిశోధనలకు చైనా మద్దతు ఇస్తుంది. ఇందులో భాగస్వామ్యం కూడా అవుతుంది. కానీ.. ఈ ముసుగులో రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తుంది’ అని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల ఐరాస జనరల్‌ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల చైనా పర్యటనపై స్పష్టత రాలేదు. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో కొత్త బృందం ఎంపికను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ క్రమంలో కొంతమంది పేర్లనూ ప్రతిపాదించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని