చిరంజీవి పక్కన చిందేసేది ఎవరు? - who will dance with chiranjeevi in acharya special song
close
Published : 16/07/2020 03:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరంజీవి పక్కన చిందేసేది ఎవరు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమాలో పాటలు అంటే ఓ ప్రత్యేక గీతం ఉండాల్సిందే. చాలా రోజుల వరకు ఈ ట్రెండ్‌ కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో అలాంటి సెటప్‌ లేకుండానే సినిమాలు వచ్చాయి. అయితే చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’లో ఐటెమ్‌సాంగ్‌ కచ్చితంగా ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆ స్పెషల్‌ సాంగ్‌లో చిరంజీవి పక్కన చిందేసిది ఎవరు అనే చర్చలోకి వచ్చేసింది. 

‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ఐదు పాటలుంటాయని... అందులో ఒకటి ప్రత్యేక గీతమని చెప్పారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందని గతంలోనే తెలిసినా.. ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ పాటలో చిరంజీవి అదిరిపోయే స్టెప్టులు వేస్తారని టాలీవుడ్‌ ముచ్చట. దీంతో ఇందులో ఆయన పక్కన మెరిసిపోయే అందం గురించి వేట మొదలైంది. 

‘ఆచార్య’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ కోసం రెజీనాను సంప్రదించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయిత ఆ తర్వాత దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి తమన్నా పేరు వచ్చింది. ‘సైరా’ సినిమాలో వీరిద్దరూ కలసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో తమన్నా చిరుతో ఆడిపాడితే వరుసగా రెండో సినిమా అవుతుంది. మరి ‘ఆచార్య’ బృందం ఎవరికి ఎంపిక చేస్తుందో చూడాలి. ‘ఆచార్య’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా... చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని