Amitabh Bachchan: మనవరాలు నవ్యని మెచ్చుకుంటూ అమితాబ్‌ పోస్ట్‌ - why amitabh bachchan admires granddaughter navya naveli nanda
close
Published : 20/09/2021 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amitabh Bachchan: మనవరాలు నవ్యని మెచ్చుకుంటూ అమితాబ్‌ పోస్ట్‌

ముంబయి: ఆమె ఓ బాలీవుడ్‌ అగ్రనటుడి మనవరాలు. అయినా సరే ఆ ఆర్భాటమూ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆమే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలి నందా. అమితాబ్‌ కుమార్తె శ్వేత తొలి సంతానమే ఈ అమ్మాయి. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నవ్య పియానో ప్లే చేస్తున్న వీడియోని అమితాబ్‌ పోస్ట్‌ చేశారు. ‘‘ఈ తాతయ్యకు గర్వకారణం ఈ మనవరాలు నవ్య. ఎందుకంటారా! తనకు తానుగా అన్ని విషయాలు సొంతంగా నేర్చుకుంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువే. డిజిటల్‌ పరంగా ఎన్నో విషయాలు తెలుసు. సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించి మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తన తండ్రి కుటుంబ బాధ్యతలూ తనే చూసుకుంటోంది. నా మొబైల్‌లో ఏవైనా లోపాలుంటే వెంటనే సవరిస్తుంది. లవ్‌ యూ నవ్యా’’ అంటూ ఆమెను మెచ్చుకున్నారు. చివర్లో కుటుంబానికి కుమార్తెలే ఆస్తి అని వ్యాఖ్య చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని