ఒకే దేశం.. ఒకటే ధర: కాంగ్రెస్‌ - why not one nation one price says congress
close
Published : 21/04/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే దేశం.. ఒకటే ధర: కాంగ్రెస్‌

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఆక్షేపించింది.  ఒకే దేశం- ఒకే మార్కెట్‌ అని నినదించే కేంద్రం.. వ్యాక్సిన్‌ విషయంలో ‘ఒకే దేశం... ఒకటే ధర’ అని ఎందుకు అనడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విమర్శించారు.‘‘ వ్యాక్సిన్‌ తయారీదారులకు లాభాలొస్తాయంటే మాకేం సమస్య లేదు.కానీ, కేంద్రం తన బాధ్యతను మరువకూడదు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

18  ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేంద్రీకృత పంపిణీ విధానం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో సగం వ్యాక్సిన్‌ నిల్వలను కేంద్రానికి ఇచ్చి.. మిగతా సగాన్ని రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు తయారీదారులకు అవకాశం కల్పించింది. విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలు అంశంపైనా ప్రైవేటు ఆస్పత్రులకు స్వేచ్ఛనిచ్చింది. అయితే దీనివల్ల వ్యాక్సిన్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతాయని, సామన్యులకు అందుబాటులో ఉండవని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

మరోవైపు కేంద్రం విధానాలను రాహుల్‌ గాంధీ కూడా విమర్శించారు. కేవలం 45 ఏళ్లు దాటిన వారికే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తోందని..18 నుంచి 45 ఏళ్లు వయస్సున్న వారికి వ్యాక్సిన్‌ను ఉచితంగా ఎందుకివ్వకూడదని ప్రశ్నించారు. ‘‘ 18-45 ఏళ్ల మధ్య వారికి ఉచిత కరోనా వ్యాక్సిన్లు లేవు. మరోవైపు వ్యాక్సిన్‌ ధరపై నియంత్రణ కోల్పోతున్నాం. మధ్యవర్తులు పుట్టుకొస్తున్నారు. బలహీనవర్గాలకు వ్యాక్సిన్‌ లభిస్తుందనే భరోసా లేదు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. జీఎస్టీ రెవెన్యూ లోటుతో ఇప్పటికే రాష్ట్రాలు మునిగిపోయాయని, కరోనా ప్రభావంతో పన్నుల వసూళ్లు కూడా పడిపోయాయని మరో సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. పీఎం కేర్స్‌ కింద సేకరించిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికెళ్లాయని ఆయన ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించలేరా? అని ప్రశ్నించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని