ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదేం? - why not same passion to win war against covid-19 as shown to win polls sibal to pm
close
Published : 21/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదేం?

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో గెలవడంపై పెట్టిన శ్రద్ధ.. కరోనాపై పోరులో ఎందుకు పెట్టడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ట్విటర్‌ వేదికగా మోదీని విమర్శించారు. ‘కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతితో దేశం సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు విస్మరించి పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి తన కండ బలాన్ని, గుండె బలాన్ని, వనరుల్ని అన్నింటినీ ఉపయోగిస్తున్నారు. మరి అదే శ్రద్ధ కరోనా వైరస్‌పై పోరులో అఎందుకు చూపడం లేదు?’ అని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. కాగా, బెంగాల్‌లో తదుపరి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీలను నిర్వహించకూడదని భాజపా సోమవారమే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని