భర్తకు కొవిడ్ సోకిందని భార్య ఆత్మహత్య - wife commits suicide husband infected with covid
close
Updated : 15/04/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్తకు కొవిడ్ సోకిందని భార్య ఆత్మహత్య

బెల్లంపల్లి టౌన్: భర్తకు కొవిడ్ సోకిందని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు రెండు వారాల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం మొండయ్య భార్య జలజ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో భర్తకు కరోనా సోకిందనే మనస్తాపంతో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని