‘ఐయామ్‌ నాట్‌ ఓకే’అంటున్న విజయ్‌వర్మ! - wild dog nag promo
close
Published : 27/03/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఐయామ్‌ నాట్‌ ఓకే’అంటున్న విజయ్‌వర్మ!

హైదరాబాద్: స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌వర్మగా నాగార్జున ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. ‘ఇది చేస్తుంది మనదేశంలో భయంతో బతుకుతున్న ప్రతీ ఒక్కరి కోసం’ అంటూ ఆయన చెబుతున్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి. పట్టుబడిన ఉగ్రవాదులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఏమీ చేయకుండా నిస్సహాయుడిలా చూడటం నావల్ల కాదంటూ తన టీమ్‌తో కదన రంగలోకి దూకారు. నాటి హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల వెనకున్న సూత్రధారులను మట్టుబెడుతున్నారు. ఈ కథంటో తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’సినిమా చూడాల్సిందే.

ఏప్రిల్‌ 2న థియేటర్లో మెషిన్‌గన్‌ మోతలతో దద్దరిల్లబోయే ఈ సినిమాలో నాగార్జున స్పెషల్‌ ఆఫీసర్‌ విజయ్‌వర్మగా కనిపించనున్నారు. నాగ్‌ టీమ్‌ను దర్శకుడు అహిషోర్‌ సోలమన్‌ స్క్రీన్‌పై వీరోచితంగా చూపించనున్నారు. ముఖ్యంగా 60వ పడిలో కూడా నాగ్‌ 20 ఏళ్ల కుర్రాడిలా చేస్తున్న స్టంట్స్‌ వావ్‌ అనిపిస్తున్నాయి. వాటన్నింటిని థియేటర్లో చూసేముందు ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని