కృష్ణవంశీ చిత్రంలో జాన్వీ కపూర్‌? - will janvi kapoor star in krishnavanshi
close
Published : 16/02/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణవంశీ చిత్రంలో జాన్వీ కపూర్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృష్ణవంశీ సినిమాలంటే భారీ తారాగణంతో పాటు కథ కూడా వైవిధ్యంగా ఉంటుందని పేరు. మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఆయన ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇందులో కథానాయికగా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ని ఎంపిక చేయనున్నానారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఓ కథను సిద్ధం చేసుకున్నారట, దానికి సంబంధించిన స్ర్కిప్టు కూడా సిద్ధమైందని సమాచారం. జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చూసిన తరువాత కృష్ణవంశీ రాసుకున్న కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించారట.

ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చలు కూడా జరిపారట. కానీ, అటువైటు నుంచి రావాల్సిన స్పందన కోసం వేచి చూస్తున్నారట. బోనీ నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శక్తి: ది పవర్‌’ అనే చిత్రం రూపొందించారు. ఈ విధంగా చూస్తే జాన్వీ కపూర్‌ని‌ తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం వంశీకే దక్కనుంది. ప్రస్తుతం ఆయన ‘రంగ మార్తాండ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీ ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా2’లాంటి చిత్రాలతో బిజీగా ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని