2006లో అనుకున్నది ఇప్పుడు అవుతుందా? - will nagarjuana and ileana team up for new movie
close
Updated : 01/08/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2006లో అనుకున్నది ఇప్పుడు అవుతుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ‘మన్మథుడు’ నాగార్జున పక్కన ఏ హీరోయిన్‌ చేసినా జంట చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి ఇమేజ్‌ మరి నాగ్‌ది. అయితే నాగార్జున - ఇలియానా జోడీని తెరపై చూద్దాం అనుకుంటూ 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నెరవేరబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. నాగార్జున కొత్త సినిమాలో ఇలియానాను కథానాయికగా తీసుకుందామని అనుకుంటున్నారట. దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. 

నాగార్జున - ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర యాక్టివ్‌గా, మగరాయుడిలా ఉండాలట. దీంతో ఆ పాత్రకు ఎవరు నప్పుతారా అని చిత్రబృందం ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇలియానా పేరు పరిశీలనకు వచ్చిందని అంటున్నారు. నిజానికి ‘దేవదాస్‌’ తర్వాత నాగ్‌- ఇలియానా జంటగా ఓ సినిమా వస్తుందని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాతో వీలవుతుందేమో చూడాలి. 

ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇది కూడా యాక్షన్‌ జోనర్‌లోనే రూపొందుతోంది. అహిసోర్‌ సాల్మన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘బిగ్‌బాస్‌ -4’ పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈసారి నాగ్‌ హోస్ట్‌గా ఎలా అలరిస్తాడో చూడాలి.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని