పవన్‌ ఆ మలయాళ సినిమా చేస్తారా? - will pawan kalyan act in ayyappanum koshiyum
close
Published : 13/08/2020 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ ఆ మలయాళ సినిమా చేస్తారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ మధ్య కాలంలో తెలుగువాళ్ల నోళ్లలో నానిన మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’. బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా అది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని పరిశ్రమల వాళ్లు రీమేక్‌ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఆ సినిమా హక్కుల్ని తీసుకుంది. అప్పటి నుంచి అందులో వీళ్లు నటిస్తారు, వాళ్లు నటిస్తారు అంటూ వార్తలైతే వస్తున్నాయి కానీ ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇప్పుడు అదిరిపోయే న్యూస్‌ ఒకటి బయటికొచ్చింది.

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమాను ఇటీవల పవన్‌ కల్యాణ్‌ చూశారని తెలుస్తోంది. అయితే ఇది సాధారణంగా చూడటం కాదని, పవన్‌ను ఆ సినిమాలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ బాధ్యతను నిర్మాణ సంస్థకు, పవన్‌కు సన్నిహితుడుగా ఉన్న ఓ దర్శకునికి అప్పగించారని భోగట్టా. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఒకవేళ పవన్‌ సినిమా చేయడానికి ఒప్పుకుంటే ఆ సన్నిహిత దర్శకుడు ముందుకు రావాల్సి ఉంటుందని అంటున్నారు. 

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ సినిమాలో నటించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే ఏదైనా కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ తెలుగులో రీమేక్‌లో రవితేజ, రానా, బాలకృష్ణ నటిస్తారంటూ గతంలో వార్తలొచ్చాయి. వాటిలాగే పవన్‌ విషయం ఓ ఊహాగానంగా మిగిలిపోతుందో లేక మెటీరియలైజ్‌ అవుతుందో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని