close
Published : 01/08/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘చంటి’.. ‘చంటబ్బాయ్‌’ అవుతాడా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ ఒక హైవోల్టేజ్‌ యాక్టర్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్‌ సీన్‌ కానీ... తనదైన ఎనర్జీతో అలరిస్తుంటాడు. త్రినాథరావు నక్కిన కామెడీ గురించి తెలిసిందే. వినోదాత్మక దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతోందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం బయటికొచ్చింది. 

రవితేజ కోసం త్రినాథరావు నక్కిన ఎప్పటిలాగే వినోదాత్మక కథను సిద్ధం చేసుకున్నారట. అందులో రవితేజ పాత్ర సీక్రెట్‌ ఏజెంట్‌/డిటెక్టివ్‌ అని తెలుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే ‘చంటబ్బాయ్‌’లో చిరంజీవిలా అన్నమాట. ఈ విషయంలో స్పష్టత లేనప్పటికీ... రవితేజ‌ త్వరలో ‘చంటబ్బాయ్‌’ అవ్వబోతున్నాడని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. మరి ఇందులో రవితేజ ఎలా మెప్పిస్తాడో చూడాలి. 

ఇటీవల ‘డిస్కో రాజా’తో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్‌’ అనే సినిమా చేస్తున్నాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన సినిమా ఉండబోతోందట.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని