‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్‌ రాబోతోందట - will soon collaborate again for falaknuma das2
close
Published : 07/06/2021 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్‌ రాబోతోందట

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ ఏర్పరుచుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ‘వెళ్లిపోమాకే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరో ‘ఈ నగరానికి ఏమైంది’తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్‌’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నానితో కలిసి విశ్వక్‌ నటించిన ‘హిట్‌’ కూడా  మంచి విజయం సాధించింది. ఇదంతా ఇలా ఉండగా.. విశ్వక్‌సేన్‌ నటించిన ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రానికి తొలి పూజ చేసి నేటి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన విశ్వక్‌.. ఈ సినిమా సీక్వెల్‌ గురించి హింట్‌ ఇచ్చాడు. త్వరలోనే ‘ఫలక్‌నుమా దాస్‌2’ ఉండబోతుందని చెప్పాడు.

‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంలో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం అందుకుంది. ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘పాగల్‌’లో నటిస్తున్నాడు. అందులో నివేదా పేతురాజ్‌, సిమ్రన్‌ చౌదరి నటిస్తున్నారు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నాయుడు నిర్మిస్తున్నారు. రాధన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని