తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్‌: సీఎం కేసీఆర్‌ - will take all the actions to protect the telugu film industry said CM KCR
close
Published : 22/11/2020 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కొవిడ్‌ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడటంతో ఇబ్బందులుపడుతున్న కార్మికులను ఆదుకోవటానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కొవిడ్‌ కారణంగా సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని సినీ ప్రముఖులు కోరారు. దీనికి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని సమాచారం.

‘‘రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోలేకపోతే ఎలా? దేశంలో ముంబయి, చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మంది ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొవిడ్‌ మహమ్మారి ధాటికి సినీ పరిశ్రమ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినీ ప్రముఖులు కలిసి పరిశ్రమను కాపాడుకోవాలి. ప్రభుత్వపరంగా ఈ పరిశ్రమను ఆదుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా తెరాస విడుదల చేసే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలనను ప్రస్తావిస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ప్రముఖ కథానాయకులు చిరంజీవి, నాగార్జున... ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు నారాయణ్ దాస్‌ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు. త్వరలో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని