WTC Final: కేన్‌ వచ్చేశాడు.. కివీస్‌ జట్టిదే - williamson available to lead new zealand in wtc final against india head coach stead
close
Published : 15/06/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: కేన్‌ వచ్చేశాడు.. కివీస్‌ జట్టిదే

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌కు శుభవార్త! ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ పూర్తిగా కోలుకున్నాడు. టీమ్‌ఇండియాతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనున్నాడు. ఈ కీలక పోరుకు ముందు అతడికి తగినంత విశ్రాంతి దొరికిందని ఆ జట్టు కోచ్‌ గ్యారీ స్టీడ్‌ అన్నాడు. 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించాడు.

ఎడమ మోచేతికి గాయం కావడంతో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు విలియమ్సన్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో టామ్‌ లేథమ్‌ నాయకత్వం వహించాడు. జట్టుకు 1-0తో విజయం అందించాడు. మరోవైపు వెన్నెముక గాయంతో దూరమైన వికెట్‌ కీపర్‌ బీజే వాట్లింగ్‌ సైతం అందుబాటులోకి రావడం గమనార్హం.

‘వారం రోజుల విశ్రాంతి దొరకడం కేన్‌, వాట్లింగ్‌కు కచ్చితంగా ప్రయోజనమే. వారిద్దరూ ఫైనల్‌కు ఫిట్‌గా, తాజాగా ఉంటారు. ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడటం నిజంగా ప్రత్యేకం. సౌథాంప్టన్‌లో అదరగొట్టేందుకు మా కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలుసు. టీమ్‌ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు. అందులో చాలా మంది మ్యాచ్‌ విజేతలు ఉన్నారు. వారిని ఓడించడం ఎంత కష్టమో మాకు తెలుసు’ అని స్టీడ్‌ అన్నాడు.

‘ఫైనల్లో మా స్పెషలిస్టు స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌. ఎడ్జ్‌బాస్టన్లో అతడు రాణించాడు. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ కొన్నేళ్లుగా మా టెస్టు జట్టులో భాగమయ్యాడు. అవసరమైన ప్రతిసారీ బంతి, బ్యాటుతో ఆదుకుంటాడు. జట్టులోంచి ఐదుగురిని వెనక్కి పంపేయడం సులభం కాదు. డగ్‌, జాకబ్‌, రచిన్‌ నిస్వార్థంగా సాయపడ్డారు. మిచెల్‌ శాంట్నర్‌తో పాటు ఫిజియోలు హెన్రిచ్‌, విజయ్‌ వల్లభ్‌ స్వదేశానికి వెళ్తారు. పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొందరిని పంపక తప్పడం లేదు’ అని స్టీడ్‌ తెలిపాడు.

న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, డేవాన్‌ కాన్వే, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్ లేథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని