భారత్‌లో మరో 25 యూకే స్ట్రెయిన్‌ కేసులు - with 25 new cases patients in india with uk covid strain at 141
close
Updated : 19/01/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో మరో 25 యూకే స్ట్రెయిన్‌ కేసులు

దిల్లీ: భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఈ కేసులు నమోదు కానప్పటికీ.. మంగళవారం కొత్తగా 25 కొత్త రకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన మొత్తం యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 141కు చేరింది. దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావడం, కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న జనంలో బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కేసులు పెరగడం కలవరం రేపుతోంది.  

గతేడాది సెప్టెంబరులో బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ మామూలు వైరస్‌ కన్నా అత్యంత వేగంగా వ్యాప్తిచెందే లక్షణం కలిగినది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లో ఇప్పటివరకూ ఈ తరహా జన్యు మార్పిడి చెందిన వైరస్‌ అంతర్జాతీయ ప్రయాణికులు, వారి సన్నిహితులకే సోకిందని కేంద్రం స్పష్టంచేసింది. వారిని గుర్తించిన రాష్ట్రాలు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ప్రపంచవ్యాప్తంగా 50దేశాలకు వ్యాపించింది. ఇదే తరహాలో దక్షిణాఫ్రికా వేరియంట్‌ వైరస్‌ను ఇప్పటివరకు 20 దేశాల్లో గుర్తించారు. 

ఇవీ చదవండి..

మాటల్లో చెప్పలేను: రహానె

రైళ్లలోనూ రెడీ-టు-ఈట్‌ మీల్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని