కరోనా వేళ అదానీ సంపదెలా పెరిగింది: రాహుల్‌ - with all struggling how did adanis wealth rise by 50 pc asks rahul gandhi
close
Updated : 14/03/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వేళ అదానీ సంపదెలా పెరిగింది: రాహుల్‌

దిల్లీ: కరోనా విజృంభణ వేళ అందరూ ఆర్థికంగా సతమతమవుతుంటే వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ సంపద అంతలా ఎలా పెరిగిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ప్రశ్నించారు. ఎవరైనా చెప్పగలారా? అంటూ వ్యంగ్యంగా ట్విటర్‌లో ప్రశ్నించారు. 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ సంపద ఈ ఒక్క ఏడాదిలోనే (2021) 50 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మరే ఇతర కుబేరుడూ సాధించని ఘనతను అదానీ సాధించారని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అదానీకి సంపద పెరుగుదలకు సంబంధించిన వార్తా క్లిప్పింగ్‌ను రాహుల్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘2020లో మీ సంపద ఎంత పెరిగింది.. సున్నా! మీరంతా సతమతమతమవుతున్న వేళ ఈయన సంపద 50 శాతానికి పైగా పెరిగింది. అదెలాగో చెప్పగలరా?’’ అంటూ రాహుల్‌ ప్రశ్నించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని