కరోనాతోఆందోళన, పక్షవాతం! - with corona anxiety and paralysis
close
Published : 13/04/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతోఆందోళన, పక్షవాతం!

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కరోనా జబ్బును తేలికగా తీసుకుంటున్నారా? ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నారా? అలాంటి భ్రమలేవైనా ఉంటే వెంటనే బుర్రలోంచి తీసేయండి. కొవిడ్‌-19 జబ్బు తగ్గినా దాని దుష్ప్రభావాలు ఏళ్ల కొద్దీ వెంటాడే ప్రమాదముందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. కరోనా జబ్బు బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సమస్యలు లేదా మానసిక జబ్బుల బారినపడుతుండటమే దీనికి నిదర్శనం. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తిన ఆరు నెలల్లోనే సుమారు 34% మంది వీటి కోరల్లో చిక్కుకు పోతుండటం గమనార్హం. ప్రధానంగా చాలామంది ఆందోళన (17%), మూడ్‌ మారిపోయే సమస్యల (14%) బారినపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 13% మంది మొట్టమొదటిసారి మానసిక సమస్యలకు లోనవుతున్నారనీ తేలింది. 

వీటితో పోలిస్తే తక్కువే అయినా మెదడులో రక్తస్రావం (0.6%), పక్షవాతం (2.1%), మతిమరుపు (0.7%) వంటివీ బాగానే వేధిస్తున్నాయి. ఇలాంటి నాడీ సమస్యలు ప్రధానంగా తీవ్ర కొవిడ్‌-19 బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి విషయంలో ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కన్నా కొవిడ్‌-19 మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది. ఫ్లూతో పోలిస్తే కరోనా జబ్బుతో నాడీ, మానసిక సమస్యల ముప్పు 44% ఎక్కువగా ఉంటుండగా.. ఇతర శ్వాసకోశ జబ్బులతో పోలిస్తే 16% ముప్పు అధికంగా ఉంటోంది. అత్యవసర చికిత్స అవసరమైనవారిలో ఇవి మరింత ఎక్కువగానూ ఉంటున్నాయి. ఉదాహరణకు- అత్యవసర చికిత్సతో జబ్బు నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత 46% మందిలో నాడీ, మానసిక సమస్యలు బయటపడుతున్నాయి. ఇవి దీర్ఘకాల సమస్యలు. అందువల్ల కొవిడ్‌-19 అప్పటికి నయమైనా, దీని దుష్ప్రభావాలు ఏళ్ల కొద్దీ వెంబడిస్తాయని గుర్తించటం ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని