ఆత్మహత్యకు తల్లి.. అమ్మ వెంటే చిన్నారి - woman drowns self after husband dies of covid-19 son follows suit
close
Published : 16/04/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆత్మహత్యకు తల్లి.. అమ్మ వెంటే చిన్నారి

నాందేడ్‌: పొట్టకూటి కోసం సొంతరాష్ట్రం వదిలి మహారాష్ట్ర వెళ్లిన ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. కొవిడ్‌తో భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకుంది. అమ్మ ఎందుకు నీటిలోకి వెళ్తుందో అర్థంగాక మూడేళ్ల కొడుకు ఆమె వెంటే నడుచుకంటూ వెళ్లాడు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి నాందేడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం తన కుటుంబంతో కలిసి నాందేడ్‌లోని లోహ్‌కు వచ్చాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 13న మృతిచెందాడు. దీంతో అతడి భార్య తీవ్ర మనస్తాపానికి లోనైంది. బుధవారం రాత్రి తన మూడేళ్ల చిన్నకుమారుడిని తీసుకుని దగ్గర్లోని సునెగావ్‌ చెరువుకు వెళ్లింది. అక్కడ గట్టుపై కొడుకును ఉంచి చెరువులోకి నడుచుకుంటూ వెళ్లి నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఏం చేస్తుందో అర్థం చేసుకోని వయసు ఆ చిన్నారిది. అమ్మ కోసం ఏడుస్తూ ఆ చిన్నారి కూడా చెరువులోకి నడుచుకుంటూ వెళ్లి నీటిలో మునిగిపోయాడు. 

కరోనా భయం.. కుటుంబాలు ఛిన్నాభిన్నం

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నిత్యం ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణలో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కరోనా భయంతో నోయిడాలో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకుని ప్రాణాలు వదిలింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని