Afghan: మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా.. విద్యార్థుల వినూత్న నిరసన - women make up half the society in show of solidarity afghan boys refrain from going to school
close
Published : 19/09/2021 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Afghan: మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా.. విద్యార్థుల వినూత్న నిరసన

కాబుల్‌: అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు అక్కడి మహిళలు, యువతులపై అనేక ఆంక్షలు విధించారు. బాలికలకు పురుష ఉపాధ్యాయులు చదువు చెప్పకూడదని తేల్చి చెప్పారు. కాగా పలు ఆంక్షల నేపథ్యంలో అనేక మంది బాలికలు విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వారిపై వివక్షను నిరసిస్తూ బాలురు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. కొంతమంది పాఠశాలలకు వెళుతున్నప్పటికీ.. సమాజంలో మహిళలు సగభాగం అని పేర్కొంటున్న కొందరు బాలురు పాఠశాలలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

బాలుర పాఠశాలలను తెరవాలంటూ అఫ్గాన్‌ విద్యాశాఖ మంత్రి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పురుష టీచర్లందరూ బడులకు వెళ్లాలంటూ ఆదేశించారు. కానీ బాలికల పాఠశాలలు తెరవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వారి స్కూళ్లు తెరిచే వరకు మేము కూడా బడులకు వెళ్లమంటూ కొందరు విద్యార్థులు తేల్చి చెబుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ‘సమాజంలో మహిళలు సగభాగం అని అన్నారు. మరి ఇప్పుడెందుకు వారిపై ఆంక్షలు విధిస్తున్నారు? వారి పాఠశాలలు కూడా తెరిచేవరకు నేను స్కూలుకు వెళ్లను’ అని 12వ తరగతి విద్యార్థి రోహుల్లా అన్నాడు. మరికొందరు విద్యార్థులు సైతం ఇదేవిధంగా పేర్కొంటున్నట్లు జర్నల్‌ తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని