ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేశాను.. - worked in a fast food joint says vijay sethupathi
close
Published : 15/07/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేశాను..

చెన్నై: జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించి.. వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. ప్రస్తుతం పరిశ్రమలో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నారు నటుడు విజయ్‌ సేతుపతి. హీరోగానే కాకుండా విలన్‌గానూ రాణిస్తున్న ఆయన మరికొన్నిరోజుల్లో బుల్లితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఆయన వ్యాఖ్యాతగా ‘మాస్టర్‌ చెఫ్‌’ అనే వంటల కార్యక్రమం కోలీవుడ్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ప్రోగ్రామ్‌ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో భాగంగా.. సినిమాల్లోకి రాకముందు తాను డబ్బు సంపాదించడం కోసం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేసినట్లు తెలిపారు.

‘చెన్నైలో ఓ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో డబ్బులు కోసం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేశాను. కాలేజీ పూర్తైన వెంటనే రూమ్‌కి వెళ్లి తిరిగి సాయంత్రం 7.30 గంటలకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లేవాడిని. అర్ధరాత్రి 12.30 వరకూ అక్కడే పనిచేసేవాడిని. పని మొత్తం పూర్తయ్యాక అక్కడే భోజనం చేసేవాడిని. అలా నాకు ప్రతి నెలా రూ.750 జీతం ఇచ్చేవాళ్లు. హోటల్‌లోనే కాకుండా ఓసారి మూడు నెలల పాటు టెలిఫోన్‌ బూత్‌లో కూడా పనిచేశాను’ అని విజయ్‌ తెలిపారు. అనంతరం తన కిష్టమైన స్నాక్స్‌ గురించి చెబుతూ.. ‘చిన్నప్పటి నుంచి నాకు ఉల్లిసమోసా అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఉల్లిసమోసా మనకు దొరకడం లేదు. కానీ ఇంట్లో ఉంటే తప్పకుండా సాయంత్రం పూట ఉల్లిసమోసా ఒక కప్పు టీ తీసుకుంటాను’ అని విజయ్‌ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని