‘ఆది పురుష్‌’లో ప్రతినాయకుడు ఇతనే! - worlds most intelligent demon in Adipurush
close
Updated : 03/09/2020 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆది పురుష్‌’లో ప్రతినాయకుడు ఇతనే!

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. భారీ బడ్జెట్‌తో పాటు 3డీలోనూ దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర తర్వాత అత్యంత ఆసక్తికర పాత్ర రావణుడు. దీన్ని ఎవరు పోషిస్తారన్న ప్రశ్నకు గురువారం చిత్ర బృందం సమాధానం ఇచ్చింది. లంకేష్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం వివరాలు పంచుకుంది.

ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’లో సైఫ్‌ ప్రతినాయకుడు ఉదయ్‌భన్‌ సింగ్‌ రాఠోడ్‌గా క్రూరత్వం నిండిన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ‘ఆది పురుష్‌’లో ప్రతినాయకుడిగా మరోసారి మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘‘సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి పనిచేయడానికి నేను ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఆయనలాంటి గొప్ప నటుడితో తెరపంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ప్రభాస్‌ అన్నారు. ఈ చిత్రాన్ని 3డీలో తెరకెక్కిస్తుండటం గమనార్హం. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘ఆది పురుష్‌’ను తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్‌ చేయనున్నారు. 2021లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022 విడుదల చేస్తారు.

గుల్షన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్‌, కిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌లు నిర్మిస్తున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్‌ వరల్డ్‌ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె కథానాయిక. ఈ రెండు చిత్రాల తర్వాత ‘ఆది పురుష్‌’ ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని