కరోనా: అమెరికాలో 1.7లక్షలకు చేరిన మరణాలు - worst situations in US crossed 1.7 lack corona deaths
close
Updated : 17/08/2020 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: అమెరికాలో 1.7లక్షలకు చేరిన మరణాలు

డిసెంబర్‌ నాటిని 3 లక్షలు దాటనున్నట్లు తెలిపిన మరో సర్వే

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా కుదిపేస్తోంది. కొవిడ్‌ కేసులతో పాటు మరణాలు సైతం అధికంగానే సంభవిస్తున్నాయి. మహమ్మారితో ఇప్పటివరకు 1.7 లక్షల మంది మరణించినట్లు రాయిటర్స్‌‌ ట్యాలీ వెల్లడించింది. వైరస్‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆరోగ్యాధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 483 మంది మృతిచెందారు.

కొవిడ్‌ కేసుల నమోదులో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 54 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే అక్కడ మరణాలు శాతం ఎక్కువగా ఉండటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ నియమ నిబంధలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యంలో వైరస్‌ ఉగ్రరూపం దాల్చనుందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనే సంస్థ వెల్లడించింది. డిసెంబర్‌ నాటికి 3 లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వైరస్‌ ధాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కొన్ని వ్యాపారాలు పునఃప్రారంభానికి నోచుకోలేకపోగా.. మరికొన్ని మూసివేతకు సిద్ధమయ్యాయి. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని