Corona - Saha: వృద్ధిమాన్‌ జయించేశాడు - wriddiman saha tests negative for covid
close
Updated : 18/05/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona - Saha: వృద్ధిమాన్‌ జయించేశాడు

త్వరలోనే జట్టుతో కలవనున్న వికెట్‌ కీపర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కరోనా వైరస్‌ను జయించాడు. మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తిరిగి కోహ్లీసేనతో కలవనున్నాడు. దాదాపుగా 17 రోజుల తర్వాత అతడికి నెగెటివ్‌ వచ్చింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు సాహాకు పాజిటివ్‌ వచ్చింది. దాంతో మే 4న ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. అయితే సాహాకు లక్షణాలు ఉండటంతో దిల్లీలోనే ఐసోలేషన్లో ఉన్నాడు. టోర్నీ వాయిదా పడ్డాక కోల్‌కతాకు వచ్చి క్వారంటైన్‌లో గడిపాడు.

ఇదే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లాండ్‌ పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. వృద్ధిమాన్‌ సాహా ఫిట్‌నెస్‌ నిరూపించుకొంటే ఇంగ్లాండ్‌కు వెళ్తాడని స్పష్టం చేశారు. కాగా రెండు రోజుల క్రితం నిర్వహించిన రెండు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో ఒకటి పాజిటివ్‌ ఒకటి నెగెటివ్‌ వచ్చింది. అతడు జట్టులో చేరడంపై సందిగ్ధం నెలకొంది. పాజిటివ్‌ వచ్చినా క్వారంటైన్‌ బ్రేక్‌ చేశాడంటూ కొన్ని వదంతులు వచ్చాయి. వాటిని అతడు ఖండించాడు. ఇంకా క్వారంటైన్లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. 

ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో సాహా క్వారంటైన్‌ బ్రేక్‌ చేశాడు. కుటుంబ సభ్యులను కలిశాక ముంబయికి బయల్దేరనున్నాడు. ‘సాహా కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాడు. అతడి శరీరంలో పూర్తి స్థాయిలో యాంటీబాడీస్‌ ఉండటంలో మళ్లీ వైరస్‌ సోకే అవకాశాలు అత్యంత తక్కువ’ అని బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని