WTC Final: టీమ్‌ఇండియాకు కఠిన సవాల్‌  - wtc final Team india
close
Updated : 08/05/2021 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: టీమ్‌ఇండియాకు కఠిన సవాల్‌ 

18 రోజులు.. రెండు బయోబుడగలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చేనెల 18 నుంచి టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుంది. అయితే, అంతకుముందే కోహ్లీసేనకు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. ఎందుకంటే మే 25 నుంచి ఎనిమిది రోజుల పాటు భారత ఆటగాళ్లంతా బయోబుడగలో ఉంటారు. ఇక జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు చేరుకొని అక్కడ మరో పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ఇది బయోబుడగను రెండు భాగాలుగా విడదీయడమని, ఇంగ్లాండ్‌కు చేరుకున్న తర్వాత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని తెలిపారు.

భారత్‌లో ఉన్నన్ని రోజులు ఆటగాళ్లెవరూ ఇతరుల్ని కలిసే అవకాశం ఉండదన్నారు. అయితే, అక్కడికి చేరుకున్నాక సాధన మొదలుపెట్టవచ్చని చెప్పారు. బయోబుడగ మారడం వల్ల ఆ వెసులుబాటు ఉందని చెప్పారు. అక్కడ ఆటగాళ్లందరికీ నిరంతరం కరోనా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సుమారు నెలన్నర పాటు ఖాళీ సమయం ఉన్నా ఆటగాళ్లంతా హోటల్‌ గదులకే పరిమితం కావాలని చెప్పారు. అలా ఉండటం ఇబ్బందికరమైన నేపథ్యంలో ఆటగాళ్ల కుటుంబసభ్యులను తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ రెండు ఈవెంట్లకు సంబంధించి శుక్రవారం సాయంత్రం బీసీసీఐ 24 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని