ఐదు నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..! - xiomi releases soon 200w fast charging air charger
close
Updated : 10/03/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదు నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!

200W ఫాస్ట్‌‌ ఛార్జర్‌ను తెచ్చేందుకు షావోమీ ప్రయత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం అర్జెంటుగా బయటకు వెళ్లాలి.. చేతిలోనేమో పవర్‌ బ్యాంక్‌ లేదు.. ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు తగిన సమయం, కేబుల్స్‌, ప్లగ్‌లు లేవు. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం.. ఎంతోకొంతసేపైనా వేచి ఉండి ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకుని వెళ్లేందుకే మొగ్గు చూపుతాం. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ ఛార్జ్ కావాలంటే ఛార్జర్‌ను బట్టి అరగంట నుంచి దాదాపు రెండు గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌తోపాటు కొత్తగా ఎయిర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఎంఐ తీసుకొచ్చిన ఎయిర్‌ ఛార్జర్‌ ద్వారా కేవలం ఇరవై నిమిషాల్లోనే ఎనభై శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చు.

ఎయిర్‌ ఛార్జర్‌ టెక్నాలజీతో ఫోన్ ఛార్జర్‌కు కనెక్ట్‌ చేయకుండా దూరం నుంచి ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కేబుల్స్, ఛార్జింగ్ స్టాండ్ అవసరం లేదు.  దీని సహాయంతో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు 200W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని షావోమీ సమాయత్తమైంది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ చేయవచ్చని ఆ కంపెనీ పేర్కొంది. అయితే ఇది ఇక్కడ కాదండి.. తొలుత చైనాలో విడుదల చేయనుంది. ఇంకా భారత్‌లోకి ఎప్పుడు తెస్తారనేది సంస్థ ప్రకటన వెలువరించలేదు. మరోవైపు రియల్‌మీ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 120W ఛార్జర్‌ను వివో iqoo 7 విడుదల చేసిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని