నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు - yami gautam summoned by ed in money laundering case
close
Updated : 02/07/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు

ముంబయి: మనీ లాండరింగ్‌ కేసులో నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది. ఈమేరకు జులై 7న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. యామీ గౌతమ్‌ ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమన్లు అందుకున్నారు.

‘ఉల్లాస ఉత్సాహ’ కన్నడ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమ్‌ పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘విక్కీ డోనర్‌’, ‘యాక్షన్‌ జాక్సన్‌’, ‘బద్లాపూర్‌’, ‘ఉరి’, ‘బాలా’ చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఆమె ‘ఉరి’ చిత్ర దర్శకుడు ఆదిత్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని