బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాలో చెర్రీ-యశ్‌..? - yash and ramcharan in biggest action drama
close
Published : 22/01/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాలో చెర్రీ-యశ్‌..?

స్క్రీన్‌పై చూడాలంటే ఐదేళ్లు ఆగక తప్పదా..?


 

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌-యశ్‌.. ఒకరేమో తెలుగులో స్టార్‌ హీరో.. మరొకరేమో కన్నడలో రాక్‌స్టార్‌.. వీరిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే అభిమానుల కలను ప్రముఖ దర్శకుడు శంకర్‌ నిజం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’ పనుల్లో బిజీగా ఉన్న శంకర్‌ త్వరలో ఓ బిగెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కోసం పవన్‌కల్యాణ్‌-చరణ్‌ స్క్రీన్‌ పంచుకోనున్నారని ఇటీవల నెట్టింట్లో పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించే పనుల్లో ఉన్న శంకర్‌ అతి త్వరలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అనంతరం ఓ యాక్షన్‌ డ్రామాను ప్రారంభించనున్నారని.. హిస్టరికల్‌ వార్‌ డ్రామాగా(చారిత్రాత్మక యుద్ధ కథాంశం) అది తెరకెక్కనుందని సమాచారం. 2022 నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నట్లు చిత్రపరిశ్రమలో భోగట్టా. అంతేకాకుండా నటీనటులుగా ఎవర్ని తీసుకోవాలనే విషయంలో శంకర్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. ఇందులో ఓ పాత్ర కోసం కన్నడ నటుడు యశ్‌ను ఫిక్స్ చేసిన దర్శకుడు మరో పాత్ర కోసం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని.. కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడు సైతం ఇందులో భాగం కానున్నారంటూ టాక్‌ వినిపిస్తోంది. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని