‘కేజీయఫ్‌‌2’ టీజర్‌ వచ్చేసింది! - yash kgf chapter2 teaser released
close
Published : 08/01/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీయఫ్‌‌2’ టీజర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌2’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. శుక్రవారం యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసింది. అయితే ఒకరోజు ముందుగా గురువారమే ఎవరో సామాజిక మాధ్యమాల్లో లీక్‌ చేశారు. దీనిపై హీరో యశ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ‘ఎవరో మహానుభావుడు టీజర్‌ను ముందే విడుదల చేశాడు. అలా విడుదల చేయడం ద్వారా వారికి ఏం లాభం చేకూరుతుందో నాకు తెలియదు. దేవుడు వారికి అంతా మంచి చేయాలి’ అని వీడియోలో యశ్‌ చెప్పుకొచ్చారు.

కాగా ఆద్యంతం అలరించేలా సాగిన ఈ టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. తొలి భాగాన్ని మించేలా రెండో భాగాన్ని తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. హీరో ఎలివేషన్‌ సీన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. సంజయ్‌దత్‌ ప్రతినాయకుడు అధీరగా ఇందులో కనిపించనున్నారు. తొలి భాగంలో అధీర పాత్రను అసలు చూపించలేదు. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని ముఖం కనపడనీయకుండా చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. కేజీయఫ్‌‌-2 మొదలు పెట్టగానే సంజయ్‌ ఆ పాత్ర చేస్తారనే సరికి మరింత ఆసక్తి నెలకొంది. రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

చాప్టర్‌-1లో మిగిలిన అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీయఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీయఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీర ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని