రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతివ్వండి: వైకాపా ఎంపీలు - ycp mps meets union minister shekavath
close
Published : 29/07/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతివ్వండి: వైకాపా ఎంపీలు

దిల్లీ: కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసిన వైకాపా ఎంపీలు.. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి, గెజిట్‌ అభ్యంతరాలపై చర్చించినట్టు తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని విన్నవించినట్టు ఎంపీలు చెప్పారు. తమ వినతికి షెకావత్‌ సానుకూలంగా స్పందించారన్నారు. ప్రాజెక్టు  అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి మార్చేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. సమావేశం అనంతరం షెకావత్‌ మీడియాతో మాట్లాడుతూ... వైకాపా ఎంపీలతో అనేక అంశాలపై చర్చించామని, సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని