‘అల’రించిన సంగీత కచేరి.. ఇంకా చూడలేదా? - year for avpl musical concert ala vaikunthapurramuloo allu arjun trivikram thaman
close
Updated : 06/01/2021 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల’రించిన సంగీత కచేరి.. ఇంకా చూడలేదా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది సినీ పరిశ్రమకు దక్కిన అత్యంత తక్కువ తీపి గుర్తుల్లో ‘అల వైకుంఠపురములో..’ ఒకటి. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించగా, అందులోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగు సినిమా పాటలు దేశ సరిహద్దులు దాటి వినిపించాయి. నేటికి సరిగ్గా ఏడాది క్రితం అంటే.. జనవరి 6, 2020న ‘ఏవీపీఎల్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్ (సంగీత కచేరి)’ పేరుతో ఆ సినిమా పాటలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అలా విడుదలైన పాటలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ సంగీత కచేరీకి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం మరోసారి ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం 7.49 నిమిషాలకు కుదించి అభిమానులతో పంచుకుంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందీ సినిమా. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లు. తమన్‌ సంగీతం అందించారు. ‘సామజవరగమన...’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ...’  పాటలైతే చిన్నాపెద్దా తేడా లేకుండా స్టెప్పులేయించాయి. సుశాంత్‌‌, నివేదా పేతురాజ్‌, టబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌, తనికెళ్ల భరణి, జయరామ్‌, మురళీశర్మ, సముద్రఖని, నవదీప్‌, సునీల్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోనే కాక అటు యూట్యూబ్‌లోనూ ఈ సినిమా పాటలు రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాను ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మించారు.

ఇదీ చదవండి..

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం: వెన్నెల ‘కంటి వెలుగులు’
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని