కారణం లేకుండా నన్ను నిందించారు: సునీత
మహిళా దినోత్సవం.. గాయని స్పెషల్ పోస్ట్
హైదరాబాద్: కొంతమంది వ్యక్తుల నుంచి తాను ఎన్నో నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్, వ్యతిరేకతను ఎదుర్కొన్నానని.. వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా సందేశం పోస్టుచేశారు. ఆమె వ్యక్తిగత జీవితంలో చవిచూసిన ఎన్నో ఇబ్బందులను ప్రతిబింబించేలా ఈ పోస్ట్ ఉంది.
‘‘నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. అలాగే, ఎప్పుడూ మీరు నన్ను నమ్మరు. నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా!?
నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను! ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను!! మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!!!’’ అని సునీత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘పంచతంత్రం’.. ఓ భావోద్వేగం
-
‘మేజర్’ కోసం ఆరు భారీ సెట్లు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
-
Radhe: మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ వచ్చేసింది
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..