David Malan : భారత బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం : డేవిడ్‌ మలన్ - you can never get used to this indian bowling attack: dawid malan
close
Published : 16/09/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

David Malan : భారత బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం : డేవిడ్‌ మలన్

(Photo : David Malan Twitter)

ఇంటర్నెట్‌ డెస్కు : భారత బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలన్‌ అన్నాడు. ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ని అయినా వారు ఇబ్బంది పెట్టగలరని పేర్కొన్నాడు. ‘భారత జట్టు బౌలింగ్‌ విభాగం చాలా పటిష్ఠంగా ఉంది. కీలక బౌలర్లైన జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెడతారు. వారిలో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత దాగుంది. వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ని సవాల్ చేస్తారు. ఇటీవల రసవత్తరంగా సాగిన టెస్టు సిరీసే అందుకు నిదర్శనం. ఇంగ్లాండ్‌ బౌలర్ల కంటే భారత బౌలర్లు మెరుగ్గా రాణించగలరు’ అని మలన్ అన్నాడు.   

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా.. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) నుంచి డేవిడ్‌ మలన్‌ వైదొలిగాడు. ఐపీఎల్‌లో అతడు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని