Yuzvendra chahal: ద్రవిడ్‌ నాకదే చెప్పారు - you will see a more confident yuzi in this series chahal
close
Updated : 09/07/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yuzvendra chahal: ద్రవిడ్‌ నాకదే చెప్పారు

కొలంబో: మరింత వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్నానని టీమ్‌ఇండియా మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అంటున్నాడు. ఇకపై ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కూడిన యూజీని చూస్తారని పేర్కొన్నాడు. సీనియర్‌గా జూనియర్లను నడిపించాలని రాహుల్‌ ద్రవిడ్‌ తనకు సూచించారని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా శ్రీలంక సిరీసుపైనే ఉందని తెలిపాడు.

‘నా బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. నేను దానిపైనే దృష్టి పెట్టాను. ఇతర బంతులు వేయడం లేదు. ఈ సిరీసులో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో నిండిన యూజీని చూస్తారు. నేను ఫామ్‌ కోల్పోయానని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడం కుదరదు. బాగా ఆడేందుకు శ్రమిస్తాను. ఇది నాకెంతో కీలకమైన సిరీసు’ అని యూజీ తెలిపాడు.

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనతో మాట్లాడారని చాహల్‌ చెప్పాడు. ‘సీనియర్‌గా యువకులను నడిపించాలని ద్రవిడ్‌ నాకు చెప్పారు. ఇది నాకు ముఖ్యమైన సిరీసని గుర్తు చేశారు. నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేయమని, చేస్తున్న పనిపై పూర్తి దృష్టిని సారించాలని సూచించారు’ అని అతడు పేర్కొన్నాడు.

టీ20లతో పోలిస్తే వన్డేలు కాస్త భిన్నమేనని చాహల్‌ అన్నాడు. తనకు 50+ వన్డేలు ఆడిన అనుభవం ఉందని పేర్కొన్నాడు. తన దృష్టంతా బ్యాట్స్‌మన్‌ను ఔట్‌చేయడం పైనే ఉంటుందని తెలిపాడు. ఈ సిరీసును బయో బుడగలో ఉండే ఆడుతున్నామని, అది సురక్షితంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని