సందేశం కాదు.. సంతోషాన్నిచ్చే చిత్రం - young tollywood directors appriciates sreekaram team
close
Published : 13/03/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందేశం కాదు.. సంతోషాన్నిచ్చే చిత్రం

హైదరాబాద్‌: శర్వానంద్‌ కథానాయకుడిగా బి.కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే  శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. దర్శకులు గోపీచంద్‌ మలినేని, బాబీ, అజయ్‌ భూపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ  ‘‘ఈ కథ రాసుకున్నప్పటి నుంచీ కొన్ని సీన్స్‌ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటాయని అనుకున్నాం. ఇప్పుడా సన్నివేశాలకు మేం అనుకున్న దాని కన్నా మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులు ట్రాక్టర్స్‌ కట్టుకుని మరీ సినిమాకు వెళ్తున్నార’’న్నారు. ‘‘మంచి కథ పడితే ప్రతి ఆర్టిస్ట్‌ ఎలివేట్‌ అవుతాడని చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ’’ అన్నారు నటుడు సాయికుమార్‌. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఓ నిర్మాతగా చాలా గర్వంగా ఉంది. మనుషుల విలువల్ని.. వారి మధ్య ఉండే భావోద్వేగాల్ని దర్శకుడు తెరపై ఎంతో సహజంగా చూపించారు. మంచి చిత్రాలు తీస్తే ప్రేక్షకులు  కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ఇంత మంచి సినిమా చూసి చాలా కాలమైందని అభినందిస్తున్నారు. కుటుంబ కథా చిత్రం కాబట్టి మంచి వసూళ్లు వస్తాయని నమ్మకం ఉంద’’న్నారు. ‘‘ఇది సందేశాన్నిచ్చే సినిమా కాదు.. సంతోషాన్నిచ్చే సినిమా. ప్రీరిలీజ్‌ వేడుకలో చెప్పినట్లు.. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ తృప్తిగా బయటకు వస్తున్నార’’న్నారు సాయిమాధవ్‌ బుర్రా. ‘‘ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా. అందరూ చూడాల్సిన సినిమా’’ అన్నారు నాయిక ప్రియాంక.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని